వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు దడ

వెలగపూడి: ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్‌ ఇస్తే ప్రభుత్వ గుట్టురట్టు చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు దడపుడుతోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఐజయ్య మాట్లాడుతూ... ఆధారాలతో సహా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాగోతాన్ని బట్టబయలు చేయడానికి ప్రతిపక్ష నేతకు మాట్లాడుతుంటే... మైక్‌ ఇవ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి విసిరిన చాలెంజ్‌ను ఒప్పుకుంటాం అని ఫస్టే చెప్పాం. కానీ, సభలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియజేయడానికి ప్రతిపక్షం ఆరాటపడుతుందన్నారు. మా దగ్గర ఆధారాలు పెట్టుకొని ఎలా మౌనంగా కూర్చుంటామని ప్రశ్నించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలనే దురుద్దేశ్యంతోనే చంద్రబాబు సర్కార్‌ చాలెంజ్‌కు పట్టుబడుతోందన్నారు. మహిళా సాధికారత సదస్సును పురస్కరించుకొని స్పీకర్‌ కోడెల చేసిన వ్యాఖ్యలను సిగ్గులేకుండా ఆయనే బయటపెట్టుకున్నారన్నారు. స్పీకర్‌ వీడియోలు ప్రసారం చేసినట్లుగానే చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు వీడియో, ఆడియో టేపులను కూడా సభలో ప్రసారం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ స్థానంలో ఉండి కారు షెడ్‌లో ఉండాలి.. ఆడది ఒంటింట్లో ఉండాలి అని మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. కోడెల ఇంట్లో వారి కోడలుకు ఏ విధమైన ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం ఉంటే ఓటుకు నోటు కేసులోని గొంతు నాదని కాదని ఒప్పుకోవాలన్నారు. తొలిసారిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సభాపతి సభా సాంప్రదాయాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top