చంద్రబాబుది పోలీసు టెర్రరిజం.. వైయస్ జగన్

హైదరాబాద్) ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసు టెర్రరిజం అని
పేరెన్నదగ్గ రీతిలో దారుణాలకు తెగబడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో
ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు చేయించిన పోలీసు దాడిని ఆయన ఖండించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ కేసుని సీబీ ఐ కి
అప్పగించాలని, అప్పుడే దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని ఆయన అభిప్రాయ
పడ్డారు. అరెస్టు చేసిన ముద్రగడను విడుదల చేయాలని, కాపులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని
ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ చీపుర్లు చూపిస్తేనే చంద్రబాబులో మార్పు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు అక్రమాల్ని బయటపెట్టి, వాస్తవాలు ప్రసారం చేస్తున్నందుకే సాక్షి టీవీ చానెల్
ప్రసారాల్ని నిలిపివేశారని, ప్రజాస్వామ్యం లో ఇది బ్లాక్ డే అని అన్నారు. వెంటనే
అన్ని టీవీ చానెళ్ల ప్రసారాల్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. 

Back to Top