భగీరథుడు కాదు చంద్రబాబు హామీలను హరించిన 420

–సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు
–హాంద్రీనీవా దివగంత నేత వైయస్సాఆర్‌ పుణ్యమే
–విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ

రొద్దం:చంద్రబాబు అపర భగీరథుడు కాదని, ఆయన పెద్ద 420, మోసకారి అని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.సీఎం చంద్రబాబు నాయుడు హాంద్రీనీవాకు నేనే శంకుస్థాపన చేశానని సిగ్గు శరం లేకుండా అన్నీ అబద్ధాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. శనివారం మండల కేంద్రంలోని ఆపార్టీ నాయకుడు ఆర్‌ఏ రవిశేఖర్‌రెడ్డి నివాసంలో శంకరనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక జిల్లాకు 20 దపాలు వచ్చినా జిల్లా ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. వచ్చిన ప్రతి సారీ అనంతపురం జిల్లా ప్రజానికాన్ని మభ్యపెట్టడానికి,మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఉరువకొండలో పర్యటించిన సీఎం అనేక వరాలు గుప్పిస్తూ, హాంద్రీనీవాకు నేనే శంకుస్థాపన చేశాను, నేనే పూర్తి చేస్తానని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం హాంద్రీనీవాకు కేవలం రూ 7 కోట్లు మాత్రమే విడుదల చేశాడన్నారు. ఆయన పాలనలో 2004 వరుకూ హాంద్రీనీవాను పునాది రాళ్లకే పరిమితం చేసిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు. దివగంత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హాంద్రీనీవా పథకానికి మరోసారి శంకుస్థాపన చేసి దాదాపు రూ 5 వేల కోట్లు ఖర్చుపెట్టాడని తెలిపారు. రాజశేఖర్రెడ్డి పుణ్యాన ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్‌గాని, గొల్లపల్లి రిజర్వాయర్‌ గాని అందులో భాగంగా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని తెలియచేశారు. ఇప్పుడు కృష్ణాజలాలు అనంతకు వస్తుంటే వాటిని నేనే తెచ్చానంటూ చెప్పుకోవడం చంద్రబాబు దిగుజారుడు తనానికి ఇదే నిదర్శన మన్నారు. చంద్రబాబుకు ఈప్రాంతం ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన డీపీఆర్‌ల ప్రకారంగా హాంద్రీనీవా ద్వారా 3.65 లక్షల ఆయికట్టుకు సాగునీరు ఇవ్వాలని తమ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 

గత ఏడాది ఇదే సమయం సెప్టెంబర్‌ మొదటి వారంలో రెయిన్‌ గన్లుతో కరువును జయించానని గొప్పలు చెప్పుకున్నావు.అది ఒట్టి బూటకమని తేలిపోవడంతో తోక ముడుచుకుని అమరావతికి పారిపోయావన్నారు.జిల్లా రైతాంగం పంటలు లేక అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం జరిగిందన్నారు. హాంద్రీనీవా పథకాన్ని రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి, రూపకల్పన చేశారో వాటిని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.వాతావరణం అనుకూలించి ఎప్పుడో రాజుల కాలం కట్టించిన చెరువులు వర్షం నీటితో నిండుతుంటే సిగ్గులేకుండా ఆవర్షాలను నేనే కురిపించానని పథకం ద్వారా సీఎం, మంత్రులు ఒక ఆలోచనతో వర్షం నీటికి జలహారతి అంటూ ప్రజా సమస్యలను తప్పదోవ పట్టించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియచేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే హాంద్రీనీవాను పూర్తిచే సి జిల్లాలో ఉన్న దాదాపు 300 చెరువులను నీటితో నింపాలన్నారు.జిల్లాకు 40 టీఎంసీల నీటిని తెచ్చినది చంద్రబాబు గొప్పతనం కాదని,అది వైయస్‌ రాశేఖర్‌రెడ్డి గొప్పతనమే అన్నారు.మహానేత తవ్వించిన కాలువులను విస్తరణ చేయాలని చంద్రబాబు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు.కాలువ విస్తరణ పేరుతో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అంతులేని నీ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు.కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి,సింగిల్‌ విండో డైరెక్టర్‌ మారుతిరెడ్డి,జిల్లా అధికారి ప్రతినిధి చంద్రశేఖర్,జిల్లా కమిటీ సభ్యులు వజీర్‌బాషా,లక్ష్మినారాయణరెడ్డి,కాటిమ తిమ్మారెడ్డి,సీనియర్‌ నాయకుడు రంగయ్య,మండల కమిటీ నాయకులు తదితరుల పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top