రైతుల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు

క‌ర్నూలు: గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ య‌మ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.  ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు రైతుల‌ను మోసం చేశార‌న్నారు. టీడీపీ ప్రభుత్వం రుణాలను పూర్తిగా మాఫీ చేయక రైతుల నెత్తిన వడ్డీలు మోపి వారిని అప్పుల పాలు చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..అంతకు మునుపు గ్రామంలోని మహత్మా బడేసాహెబ్‌స్వామి వారి దర్గాను దర్శించుకొని ప్రత్యేక ఫాతెహలు చేశారు.  కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు ధర్మకారి నాగేశ్వరరావు, సయ్యద్‌చాంద్,అల్లబా, గ్రామ నాయకులు తిరుమలేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ బందెనవాజ్, చిన్నరంగారెడ్డి, ప్రహల్లాద,రాముడు, వెంకటేష్,రామన్న తదితరులు పాల్గొన్నారు.

Back to Top