చంద్రబాబుకు ఆత్మ లేదు.. గౌరవమూ లేదు

హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013:

అవినీతి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు నాయుడికి ఆత్మలేదు... గౌరవమూ లేద'ని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టిడిపిలు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నాయని మేకపాటి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని ‌ఆయన ఆరోపించారు. ‌మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ‌న్ను కోరామని రాజమోహ‌న్‌రెడ్డి వెల్లడించారు. శనివారం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు రాజభవన్లో గవర్న‌ర్ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజభవ‌న్ బయట ఏర్పాటు చేసిన ‌మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని గవర్నర్కు వివరించామన్నారు.‌

రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని కోరామని‌ మేకపాటి చెప్పారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబా‌ద్ లాంటి నగరం సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందని‌ ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణ, సీమాంధ్రుల శ్రమ ఉందని తెలిపారు. విభజన వల్ల ఏర్పడుతున్న సమస్యలపై పరిష్కారం చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు కరె‌క్టు అని ఆయన ప్రశ్నించారు.

Memorandums submitted to The Governor by YSR Congressవిభజన ప్రకటన వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అవేమీ పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యూఢిల్లీలో తిరుగుతున్నారని రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఒక పక్కన సమైక్య ఉద్యమంతో రాష్ట్రం తగలబడుతోంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, అమర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గొల్ల బాబూరావు, గుర్నాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తెల్లం బాలరాజు, కొరముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్కుమా‌ర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, దేశా‌యి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు తదితరులు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top