వేరుశనగ రైతులను ఆదుకోవాలి

కదిరిః
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించారు.
తుఫాన్ తో దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. ఆరుగాలం శ్రమించి
పండించిన వేరుశనగ పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలు అయ్యింది. రైతులు తమ
ఆవేదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో
వేరుశనగ పంట నాశనమైందని, రైతులను ఆదుకోవాలని చాంద్ బాషా ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వేరుశనగ మొలకలు
కొనుగోలు చేయాలని కోరారు.
Back to Top