ఎమ్మెల్యే చాంద్ బాషా ధర్నా

అనంతపురం(కదిరి): ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన వాహనంపై దాడికి నిరసనగా కదిరిలో ధర్నా చేపట్టారు. తక్షణమే  దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లభ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో  ధర్నాలో పాల్గొన్నారు.

Back to Top