చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరువు

అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రభుత్వ అసమర్థ పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పక్కా గృహాలు నిర్మించని కారణంగా..భారీ వర్షాలతో  ఇళ్లు లేని నిరుపేదలంతా చనిపోతున్నారని చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఇళ్లులేని పేదలు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తన హయాంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని..అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో చాంద్ బాషా గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top