చంద్రబాబుపై భాస్కరరామారావు నిప్పులు

రాజమండ్రి, 29 మార్చి 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ చేయిస్తారనే భయంతోనే చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్తో చీకటి ఒప్పందం ఉన్నందునే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని ఆయన పెదవి విరిచారు.

Back to Top