చండూరులో నేడు షర్మిల బహిరంగ సభ

నల్గొండ, 11 ఫిబ్రవరి 2013: నల్గొండ జిల్లా చండూరులో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగుతూ పరోక్షంగా కొమ్ము కాస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నైజాన్ని నిరసిస్తూ శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. ప్రజలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. షర్మిల పాదయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

సోమవారం ఉదయం వెంకలపల్లి శివారు నుండి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె దోనిపాముల చేరుకుంటారు. శ్రీమతి షర్మిల దోనిపాముల నుంచి బంగారుగడ్డ చేరుకుని.. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి అంగడిపేట, చండూరు, కోటయ్యగూడెంల మీదుగా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం ఉడతలపల్లి చేరుకుంటుంది. సోమవారంనాడు శ్రీమతి షర్మిల 14.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
Back to Top