వైయస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టు

 
అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం అఖిల పక్షం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. చలో అసెంబ్లీలో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పార్థసారధి, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసు, సామినేని ఉదయబాను, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు తదితరులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా అన్నది ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీ. ప్రత్యేక హోదాను తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశారు. ధర్నాలు, బంద్‌లు నిర్వహించారు, యువభేరీ కార్యక్రమం చేపట్టారు. మరోమారు ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది. మరో వైపు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో తలపెట్టిన మహిళా సదస్సును టీడీపీ అడ్డుకునేందుకు కుట్రలు చేసింది. సదస్సుకు అనుమతి లేదంటూ మహిళలను అడ్డుకున్నారు. ఈ రెండు సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ దమననీతికి నిదర్శనం.
 
Back to Top