చావెజ్ మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్ 06 మార్చి 2013:

ప్రపంచ సంక్షేమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మృతికి సంతాపంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వ్యాఖ్య చేశారు. పెట్టుబడిదారీ విధానం ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న తరుణంలో సామ్యవాదం, సంక్షేమం, పేద ప్రజల అభ్యుదయం ప్రభుత్వ విధానాలుగా గుర్తించిన చావెజ్ తన పద్నాలుగేళ్ళ పాలనలో ఆచరించి చూపారని ఆమె ప్రశంసించారు. మహానాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో మన్ననలుకూడా అందుకున్నారన్నారు. ప్రపంచంలోని శ్రేయోవాదులు, సంక్షేమవాదులకు చావెజ్ సైద్ధాంతికంగా స్ఫూర్తిప్రదాత అయ్యారనీ, అటువంటి మహామనీషి మరణం ప్రపంచానికే తీరని లోటనీ శ్రీమతి విజయమ్మ ఆ ప్రకటనలో వివరించారు.

Back to Top