'చార్జిషీట్‌ నుంచి వైయస్‌ పేరెందుకు తొలగించలేదు'

విజయవాడ, 21 ఏప్రిల్‌ 2013: వివాదాస్పద 26 జీఓల కేసులో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరును చార్జిషీట్ నుంచి ఎందుకు తొలగించలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. బోఫోర్సు కేసులో నిందితుడు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించిన తరువాత చార్జిషీట్‌ నుంచి ఆయన పేరును తొలగించిన వైనాన్ని గట్టు ప్రస్తావించారు. విజయవాడలో ఆదివారంనాడు 'సిబిఐ విచారణలో వివాదాలు' అనే అంశంపై జరిగిన చర్చలో గట్టు రామచంద్రరావు పాల్గొన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కేసులపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరగడంలేదని గట్టు ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషి అని తేలితే జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. సిబిఐ తన పని తాను చేయకుండా.. ప్రభుత్వం పని కూడా చేస్తోందని గట్టు దుయ్యబట్టారు.
Back to Top