వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిదాయకం..

విజయనగరంః వైయస్‌  జగన్‌కు  ప్రజల నుంచి విశేష స్పందన  రానున్న కాలంలో రాష్ట్ర భవిష్య™Œ ను మార్చబోతుందని తేటతెల్లం అవుతుందని ప్రముఖ సినీ దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను సినీ దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు.కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ కుటుంబం ప్రజల్లో సుస్థిరస్థానం సంపాదించారన్నారు. ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం జగన్‌పై అభిమానానికి తార్కాణమన్నారు. ప్రజలకు వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన మేలు..మళ్లీ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తేనే జరుగుతుందని తెలిపారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ 3వేల కిలోమీటర్లు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మేమకమవడం జగన్‌కే సాధ్యమయిందన్నారు. జగన్‌ ఓర్పుకు చాలా అశ్చర్యకరంగా ఉందని, వైయస్‌ జగన్‌ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన ప్రత్యక్షంగా చూశామని చాలా అద్భుతంగా ఉందన్నారు.
 

Back to Top