ఎంపీ అవినాష్ రెడ్డి నిధులతో సిమెంట్ రోడ్డు ప్రారంభం

కడప) వైఎస్సార్ జిల్లా
మైదుకూరు లో సీసీ రోడ్డును స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. పట్టణం
నుంచి బద్వేల్ వైపునకు వెళ్లే రోడ్డు మార్గం సక్రమంగా లేదని గుర్తించిన ఎమ్మెల్యే
అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీన్ని పురపాలక శాఖ అధికారులు పట్టించుకోలేదు.
దీంతో కొంత కాలం క్రితం అక్కడకు వచ్చిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి విషయాన్ని
తెలియపరిచారు. దీంతో ఆయన రోడ్డు మార్గం కోసం రూ. 1.98 లక్షల నిదుల్ని విడుదల
చేశారు. దీంతో ఆ పనుల్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు వంటి మౌళిక
సదుపాయాల్ని అందించేట్లుగా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. 

Back to Top