రూ. 4 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం

నెల్లూరు: మానమాల గ్రామ పంచాయతీలో వైయస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌ ఉచ్చూరు శోభారాణి ఆధ్వర్యంలో ఉపాధిహామీ, పంచాయతీ నిధులు రూ. 4 లక్షలతో సిమెంట్‌ రోడ్డును చేపట్టారు. గ్రామంలోని బీసీ కాలనీ నుంచి చింతా దశరధరామిరెడ్డి నివాసం వరకు ’140 మీటర్లుతో రోడ్డు ఏర్పాటు చేశారు. గతంలో రహదారి అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు సర్పంచ్‌ దష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన సర్పంచ్‌ సిమెంట్‌ రోడ్డు నిర్మాణంకు అధికారులతో చర్చించి నిధులు మంజూరైయ్యేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేసినందుకు గ్రామస్తులు కతజ్ఙతలు తెలిపారు. గ్రామంలో కొన్ని కాలనీల్లో చిన్న పాటి రోడ్లు నిర్మించాల్సి ఉందని, నిధులు రాగానే అన్ని కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు.  

Back to Top