ఏసీబీ ఛార్జ్ షీట్ లో నిందితుడుగా చంద్ర‌బాబు..!


హైద‌రాబాద్‌) ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో నిందితుడిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపేరును చేర్చారు. ఈ మేరకు తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ ఛార్జ్ షీటు త‌యారుచేసి స‌మ‌ర్పించినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొంద‌రు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ ను క‌లిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బేర‌సారాలు ఆడారు. అదంతా టీ ఏసీబీ వీడియో లో రికార్డు చేసింది. ఆ సంభాష‌ణ‌ల్లో త‌న‌ను బాస్ పంపించారంటూ ఘ‌నంగా చెప్పుకొన్నారు. ఈ కుంభ‌కోణం మీద ద‌ర్యాప్తు చేసిన తెలంగాణ ఏసీబీ సూత్ర‌ధారిగా చంద్రబాబు పేరును ఛార్జి షీటులో చేర్చింది.
------------

తాజా ఫోటోలు

Back to Top