ఒక‌ మంత్రి మీద కోపం..!

చంద్ర‌బాబు నాయుడు
చెప్పిన మాట వినక‌పోతే చాలా  కోపం వ‌చ్చేస్తుంది.
ఈ కోపం ఇప్పుడు ఒక‌ మంత్రి మీద కేంద్రీకృత‌మైంది. పుష్క‌రాల ప‌నులు ఊపందుకొన్న‌ప్ప‌టి
నుంచి సంబంధిత శాఖ మంత్రి  పుష్క‌రాల ప‌నుల మీద దృష్టి
పెట్టిన‌ట్లు స‌మాచారం. అయితే దాదాపు 1650 కోట్ల రూపాయిలు విడుద‌ల చేసి, వంద‌ల కోట్ల
రూపాయిలు నొక్కేసేందుకు చంద్ర‌బాబు కోర్ టీమ్ స్కెచ్ వేసుకొన్నారు. అందుకే బీజేపీకి
చెందిన ఈ మంత్రి ఈ ప‌నుల జోలికి వ‌స్తే నిజాలు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని భావించారు. అందుకే
ఆ మంత్రిని పూర్తిగా  దూరం పెడుతూ వ‌చ్చారు.
ఆఖ‌రికి పుష్క‌రాల స‌మ‌యం చివ‌రికి వ‌చ్చేస‌రికి ఆయ‌న ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కే అనేశారు.

పుష్క‌రాల మొద‌టి
రోజున తొక్కిస‌లాట జ‌ర‌గ‌టంతో అందరి దృష్టి అటు వైపు మ‌ళ్లింది. కొంత కాలంగా సంబంధిత‌
మంత్రిని కూడా ప‌క్క‌న పెట్టేసి చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న ఆగ‌డాల్ని అంతా
ప్ర‌స్తావించారు. దీంతో చంద్రబాబు టీమ్ కు ఆ మంత్రి మీద కోపం వ‌చ్చింది. ప‌నుల స‌మ‌యంలో
పంటి కింద రాయిలా ఉండ‌ట‌మే కాకుండా ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల చేతికి ఒక అస్త్రం ఇచ్చిన‌ట్ల‌యిందని
కోపాలు నూరుతున్నారు. పుష్కరాల ఘ‌ట‌న‌కు బాధ్యుడిగా ఆయన్నితప్పించేయాల‌న్న ఆలోచ‌న కూడా
చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దీనికి
మ‌రో విష‌యం కూడా తోడ‌వుతోంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఒక
ఐఐటీ మంజూరు అయింది. దీన్ని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం (స‌ద‌రు
మంత్రి సొంత నియోజ‌క వ‌ర్గం) లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఏలూరు లో భూములు
కొనుక్కొన్న తెలుగుదేశం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్ర‌బాబుని సంప్ర‌దించారు. గిట్టుబాటు
అవుతుంద‌న్న ఉద్దేశ్యంతో దీన్ని ఏలూరుకి మార్చేందుకు కోట‌రీ చ‌క్రం తిప్పింది. రాష్ట్ర  ప్ర‌భుత్వం నుంచి ఆ దిశ‌గా అడుగులు ఏయించింది. దీంతో
తాడేప‌ల్లి గూడెం ప్ర‌జా ప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడి కేంద్రాన్ని ఒప్పించి
ఐఐటీ ని స‌ద‌రు మంత్రి   సొంత నియోజ‌క వ‌ర్గానికే
తిరిగి తెప్పించుకొన్నారు. ఇది న‌చ్చ‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు పుష్క‌రాల ఘ‌ట‌న క‌లిసివ‌చ్చింది.
దీంతో ఆయ‌న పై వేటు వేయాల‌ని ప‌ట్టు ప‌డుతున్నారు.

Back to Top