చంద్ర‌బాబు రియ‌ల్ ఐడియా


విజ‌య‌వాడ‌) పరిపాల‌న‌ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌డావుడి చేయ‌టం వెనుక చాలా క‌థ ఉంది. ఇదంతా రియ‌ల్ ఎస్టేట్ హ‌వా కోస‌మే అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

రాజ‌ధాని రియ‌ల్ బూమ్‌
రాజ‌ధానిని కృష్ణా గుంటూరు జిల్లాల మ‌ధ్య‌న పెడ‌తామ‌ని ప్ర‌క‌టించటానికి ముందే ప్ర‌ణాళిక‌లు రెడీ అయ్యాయి. చంద్రబాబు కోట‌రీకి చెందిన పెద్ద‌మ‌నుషులు రంగంలోకి దిగి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భూముల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. త‌ర్వాత తూళ్లురులో రాజ‌ధానిని ప్ర‌క‌టించాక‌, నెమ్మ‌దిగా వెంచ‌ర్ లు వేయ‌టం మొద‌లు పెట్టారు. కానీ, ఎంత‌కూ రాజ‌ధాని కార్య‌క‌లాపాలు విజ‌య‌వాడ వైపున‌కు రాక పోవ‌టంతో ఈ రియ‌ల్  ఎస్టేట్ వ్యాపారులు ఒత్తిడి చేయ‌టం ప్రారంభించారు. దీంతో చంద్ర‌బాబు అండ్ కో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం హ‌డావుడి చేయ‌టం మొద‌లు పెట్టారు. కార్యాలయాల త‌ర‌లింపు, ఉద్యోగుల త‌ర‌లింపు అంటే కాస్త క‌ష్టం కాబ‌ట్టి మంత్రులు, ఉన్న‌తాధికారుల క్యాంప్ కార్యాల‌యాల్ని కూడా తెచ్చేసుకొంటున్నట్లు ప్ర‌క‌టించారు. 

అద్దె భ‌వ‌నాల హ‌డావుడి
మంత్రుల క్యాంప్ కార్యాల‌యాలు, నివాస గృహాలు, అతిథి గృహాల కోసం అద్దె భ‌వ‌నాల్ని తీసుకోవ‌టం మొద‌లు పెట్టారు. ఇక్క‌డ కూడా చంద్ర‌బాబు కోట‌రీకి చెందిన కొందరు నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్నారు. గుంటూరు లో ల‌క్షా 57వేల చ‌ద‌ర‌పు అడుగుల భ‌వ‌నాలు 10 గుర్తించ‌గా, విజ‌య‌వాడ‌లో మ‌రికొన్ని భ‌వనాలు గుర్తించారు. మంత్రులు, ఉన్న‌తాధికారుల నివాసాల కోసం 252 అపార్టుమెంట్లు, 31 విల్లాలు, 20 కాటేజీలను గుర్తించారు. వీటిని అద్దెకు తీసుకోవ‌టానికి రంగం సిద్ధం అయింది. మార్కెట్ రేటు కంటే అనేక రెట్లు ఎక్కువ అద్దె వ‌సూలు చేసుకొనేలా మ‌ద్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు కొంద‌రు నాయ‌కులు ఈ చ‌ర్చ‌ల్లో మునిగి ఉన్నారు 

పచ్చ చొక్కాల‌కు పండుగ‌
అద్దె భ‌వ‌నాల ఏర్పాటు, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ల కోసం చంద్ర‌బాబు ప‌డుతున్న తాప‌త్ర‌యం ప‌చ్చ చొక్కాల‌కు పండ‌గ చేస్తోంది. ఈ హ‌డావుడి లో నాలుగు డ‌బ్బులు వెనుకేసుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చురుగ్గా చేస్తున్నారు. ప‌రిపాల‌న అక్క‌డ‌కు త‌ర‌లించ‌టం చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని, అందుకే ఈ హ‌డావుడి అని తెలుగు త‌మ్ముళ్లు అంగీక‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రియ‌ల్ బూమ్ కోసం చేస్తున్న‌హ‌డావుడి మాత్రం త‌మ‌కు బాగా క‌లిసి వ‌స్తోంద‌ని సంతోషిస్తున్నారు. 
Back to Top