బాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి


ఢిల్లీ: చంద్రబాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి హోదా అవసరం లేదు.. ప్యాకేజీ సంజీవని అని మాట్లాడిన వ్యక్తి మళ్లీ హోదా కావాలని మాట్లాడడం హాస్యస్పదమన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 29 సార్లు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ఏం సాధిస్తారని 30వ సారి వచ్చారని ప్రశ్నించారు. ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా అవినీతికి పాల్పడి ఆ డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించాడని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి, బంధుప్రీతి, పోలవరం, రాజధాని నిర్మాణం, సెక్స్‌రాకెట్, విదేశాల్లో ఆస్తులు, విదేశీ పర్యటనలు ఇలా పది అంశాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top