అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి

న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్‌ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సంస్థ మోసాల వల్ల సుమారు 40 లక్షల మంది బాధితులయ్యారన్నారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు, ఏజెంట్లకు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరి హారాన్ని చెల్లించాలని కోరుతూ సంస్థ బాధితులు, ఏజెంట్ల సంఘం సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టాయి.  ఆయన దీక్షా శిబి రాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శారదా స్కాం వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ స్కాం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపాలని 2015 మే 23న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తాను లేఖ రాశానన్నారు. 
Back to Top