కులాలను విడదీస్తున్నారు

నంద్యాల: ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు టీడీపీ నేతలు కులాల వారిగా విభజించి చిచ్చు పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో మాలలు, మాదిగలను, బలిజను, ముస్లింలను విడదీస్తున్నారని ఆరోపించారు. ఎన్టీ రామారావును దించిన చరిత్ర కలిగిన చంద్రబాబుకు ప్రజలు ఓ లెక్కా? అన్నారు. మన పప్పు పంచాయతీ రాజ్‌ మంత్రి లోకేష్‌ ఈ రోజు ఎన్నికలు జరిగితే 140 సీట్లు అంటున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ప్రచారం చేస్తేనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. భూమా అఖిలప్రియ వైయస్‌ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నంద్యాల ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని నారాయణ స్వామి హెచ్చరించారు.
––––––––––––––
 పార్టీలకు అతీతంగా శిల్పాకు మద్దతు
ఎమ్మెల్యే శ్రీనివాసులు
నంద్యాల: ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాలలో టీడీపీ అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోడ్ల విస్తరణ అంటూ సామాన్యులు, వ్యాపారులను రోడ్డున పడేశారని, ప్రత్యామ్నాయాలు చూపడకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇన్నాళ్లు అభివృద్ధి చేయకుండా టీడీపీ నాయకులు ఎక్కడికి వెళ్లార ని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప..టీడీపీ కొత్తగా చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు.
చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top