బాబుకు సుప్రీంకోర్టు నోటీసుల‌పై వాయిదా తీర్మానం

అమరావతి: ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులు జారీపై చర్చించాలంటూ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది.  నియామవళి 63 కింద వైయ‌స్‌ఆర్‌ సీపీ ఈ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను మొద‌లుపెట్ట‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వాయిదా తీర్మానంపై చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టారు. అయినా కూడా స్పీక‌ర్ పట్టించుకోకుండా టీడీపీ నేత‌ల‌కు మైక్ ఇచ్చి తిట్టించే ప్ర‌య‌త్నం చేశారు.

Back to Top