ప్రజల పక్షాన మాట్లాడితే కేసులా....?

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన మాట్లాడినందుకు కేసులు నమోదు చేయడం దారుణమని పార్టీ తనకల్లు మండల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. మండల కన్వీనర్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వాన్ని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను నిలదీసినందుకు వైయస్‌ జగన్‌పై కేసులను పెట్టడం నీతిమాలిని చర్యగా పేర్కొన్నారు. వెంటనే తమ నేతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్ధార్‌ నాగేంద్రకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా కన్వీనర్‌ విజయలక్ష్మీ, ఎంపీటీసీ రెడ్డెప్పరెడ్డి, నాయకులు కొండకమర్ల మెహతాబ్, తబ్రేజ్, నాగభూషణరెడ్డి, రామ్‌దేశాయ్,వాసుదేవారెడ్డి, రాధాకృష్ణ, చాంద్‌బాషా, మలిరెడ్డి,నరసింహులు, చిందానందరెడ్డి, జంగమరెడ్డి, సునీల్, లక్ష్మీరెడ్డి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Back to Top