ట్రావెల్స్‌పై కాకుండా వైయస్ జగన్‌పై కేసులా?

విజయవాడ: చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. దివాకర్‌ రెడ్డి ట్రావెల్స్‌ కాబట్టే డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదన్నారు. వాస్తవాలు వెల్లడవుతాయన్న భయంతోనే పోస్టుమార్టం చేయలేదని దుయ్యబట్టారు. దివాకర్‌ ట్రావెల్స్‌పై కాకుండా వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయిందని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అంబటి స్పష్టం చేశారు.

Back to Top