బాలకృష్ణపై కేసు నమోదు

హైదరాబాద్ః  మహిళలను కించపర్చేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పై న్యాయవాద జేఏసీ హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలకృష్ణపై కేసు నమోదైంది. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివని ఈ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు.

నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ మహిళలపై  అసభ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..’’ అని బాలకృష్ణ దారుణంగా మాట్లాడారు. 
Back to Top