రాజధాని రైతుల మండిపాటు

మంగళగిరి : ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవటం లేదంటూ రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో 'రాజధాని భూసేకరణ- సామాజిక ప్రభావం' అనే అంశంపై అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని.. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా సదస్సు ఎందుకు పట్టారంటూ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందుగా తమ ఇబ్బందులను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

Back to Top