అప్పు చేసి ప‌ప్పు కూడు..!


రాజ‌మండ్రి ) అమ‌రావ‌తి ప్లాన్ పేరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో మారు అప్పు ల కుప్పంగా రాష్ట్రాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇల్లు లేక‌పోతే అప్పు చేసి క‌ట్టుకొంటాం. ఇప్పుడు రాజ‌ధానిని కూడా అలాగే క‌ట్టుకొందాం అని ఆయన స్వ‌యంగా పిలుపు ఇచ్చారు. తాజాగా సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన బృందం - రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అందించింది. ఇందులో ఉన్న వివ‌రాలు ప్ర‌కారం లోటు బ‌డ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి త‌ళ‌త‌ళ లాడే రాజ‌ధాని రూపొందించుకొనే ప్ర‌ణాళిక రూపొందించారు. ఆకాశ‌మే హ‌ద్దుగా క‌ల‌ల భ‌వంతుల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించారు. అయితేమాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ ను స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిలో ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మ‌న‌స్సులో మాట చెప్పేశారు. అంటే కావాల్సిన సంస్థ‌కే ఎటువంటి టెండ‌ర్లు, పరిశీల‌న లేకుండా వేల కోట్ల రూపాయిల ప‌నులు అప్ప‌గించేస్తార‌న్న మాట‌..!
Back to Top