రాజధాని నిధుల లెక్కలు తేల్చండిః రాజేంద్రనాథ్ రెడ్డి

హైదరాబాద్ః సింగపూర్‌ కన్నా10 రెట్లు ఎక్కువ‌, కోల్‌క‌తా కన్నా నాలుగు రెట్లు ఎక్కువ రాజ‌ధాని క‌డుతున్నామ‌ని చెబుతున్న టీడీపీ స‌ర్కార్.... ఇప్ప‌టికీ రెండేళ్లు అవుతున్నా చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.  రాజ‌ధానికి సంబంధించి అసలు సమగ్ర నివేదిక ఉందా అని బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి  ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఈ రెండేళ్ల‌లో దాదాపు 30 నుంచి 40వేల ఎక‌రాలు రైతుల నుంచి భూములు సేక‌రించార‌న్నారు. 

రాజ‌ధాని నిర్మాణం కోసం అసలు ఎన్ని నిధులు ఖ‌ర్చు చేస్తార‌ని..? ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మేర నిధులు ఖ‌ర్చు చేశార‌ని..?  ప్ర‌స్తుతం రాజ‌ధాని కోసం ఉన్న నిధులు ఎన్ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అందులో కొండ‌వీటి వాగు పొంగితే దాదాపు 13వేల ఎక‌రాలు మునిగిపోతాయ‌ని, కేవ‌లం రెండు మీట‌ర్ల ఎత్తు పెంచ‌డానికి 1,500 కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని చెబుతున్నారు. తిరుప‌తి, సెక్ర‌టేరియ‌ట్‌ల‌లో రాజ‌ధాని నిధుల సేక‌ర‌ణ అంటూ హుండీలు పెడుతున్నారు. ఆన్ లైన్ లో ఇటుక‌లు, పిల్ల‌ల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు. ఆ లెక్క‌లు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయో చెప్పాలని బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని సభలో నిలదీశారు. 

Back to Top