రాజధాని ప్రాంత రైతుల ఆందోళన

అమరావతి: రాజధాని రైతుల పాలిట శాపంలా ప్రభుత్వం తయారైంది.  రాజధాని ప్రాంతంలో మరో నిర్వాకానికి సీఆర్‌డీఏ అధికారులు తెగబడ్డారు. రైతులకు ఏమాత్రం చెప్పకుండా.. ఏకంగా పంటకాలువలను పూడ్చేసే పని పెట్టుకున్నారు. సీఆర్‌డీఏ అధికారులు భారీ ప్రొక్లెయినర్‌లతో వచ్చి పంటకాలువలను పూడుస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. 

రాజధాని ప్రాంతంలో రైతుల జోలికి వెళ్లబోమని, పంట కాలువలను పూడ్చబోమని గతంలో గుంటూరు కలెక్టర్‌ న్యాయస్థానానికి విన్నవించారు. కోర్టుకు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు పంటకాలువలను పూడ్చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇలా పంటకాలువలను పూడ్చడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, దీనిపై కోర్టుకు వెళుతామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Back to Top