వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన రాజ‌ధాని రైతులు

గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఉండ‌వ‌ల్లి శివారులో రాజ‌ధాని రైతులు క‌లిశారు. స్సీడ్ యాక్సిస్ పేరుతో ఓ రోడ్డు పెట్టి ఆర్‌డీవో మాకు నోటీసులు ఇచ్చార‌ని, ఈ రోడ్డు గురించి ప‌రిశీలించాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ఎన్‌టీఆర్ వాస్త‌వుల‌ను క‌దిలించ‌కుండా చూడాల‌ని వారు వేడుకున్నారు. రాజధానిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్‌ 41 ఎస్సీ రైతుల పాలిట శాపంగా మారిందని వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు వైయ‌స్‌ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి ఎస్సీలు పంటలు పండించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని అసైన్డ్‌ భూములు అంటూ 1000 చదరపు గజాలు కేటాయిస్తూ, మిగిలిన రైతులకు మాత్రం 1450 చదరపు గజాలు ఇస్తోందని తెలిపారు. అందరితో సమానంగా ఎస్సీ రైతులకు కూడా 1450 చదరపు గజాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జననేతను కోరారు.  స‌చివాల‌యంలో అడుగు రూ.1200 చొప్పున తాత్కాలిక భ‌వ‌నం నిర్మించార‌ని, మాకు మాత్రం ఇల్లు నిర్మించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీరు సీఎం అయితేనే మా బ‌తుకులు మారుతాయ‌ని వారు వైయ‌స్ జ‌గ‌న్ వ‌ద్ద వేడుకున్నారు. ప‌త్తిపాటి పుల్లారావు అనుచ‌రులు భూములు లాక్కున్నార‌ని ఫిర్యాదు చేశారు.
Back to Top