హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి భూములిచ్చిన వారి పట్టా భూములను సీఆర్డీఏ అధికారులు తక్కువ చేసి చూపిస్తుండడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌ లో తమ భూములు తీసుకొని  ప్రభుత్వం మోసగించిందని, సీఆర్‌డీఏ అధికారులు పట్టా భూములను తక్కువ చేసి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Back to Top