గోపాల్‌రెడ్డి గెలుపునకు విస్తృత ప్రచారం

అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టారు. మంగళవారం పార్టీ  మండల కన్వీనర్‌ సత్యరాయణశాస్త్రి , జిల్లా కార్యదర్శి ఎస్‌కే ఆంజినేయులు, తదితరుల ఆధ్వర్యంలో మలయనూరు, నిజవళ్లి,
బసాపురం, ఎ్రరగుంట తదితర పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులు మరోసారి చంద్రబాబును నమ్మి మోసపోవద్దని, వైయస్‌ఆర్‌సీపీతోనే అధివృద్ధి సాధ్యమన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటేయాలని పట్టభద్రులను కోరారు. 
Back to Top