రాష్ట్ర‌వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు

-మ‌హిళ‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా ప్ర‌ద‌ర్శ‌న‌లు
అమ‌రావ‌తి: మ‌హిళ‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల దాచేప‌ల్లి ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చేప‌ట్టిన క్యాండిల్ ర్యాలీకి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును మ‌హిళ‌లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు ముక్త‌కంఠంతో ఖండించారు. ప్ర‌బుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే మ‌హిళ‌ల‌పై దాడులు జ‌ర‌గుతున్నాయ‌ని విమ‌ర్శించారు.  దాచేప‌ల్లి ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని మ‌హిళా నేత‌లు మండిపడ్డారు.   ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా?  అని నిల‌దీశారు.   ‘రిషితేశ్వరి కేసులో సెటిల్‌ మెంట్‌ చేశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారు. గుంటూరు జడ్ఫీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌కు అన్యాయం చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్‌మెంట్లు చేశారు. ఐపీఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్‌ రిపోర్ట్‌లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని మ‌హిళా నేత‌లు నిలదీశారు. 

తాజా వీడియోలు

Back to Top