క్యాండిల్‌ ర్యాలీకి రూట్‌ మ్యాప్‌

ఏపీః ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే రోజున క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే కార్యకర్తల కోసం పార్టీ కేంద్ర కార్యాలయం దిశా నిర్దేశం చేసి రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఏయే జిల్లాల్లో ఎక్కడ్నుంచి ఎక్కడి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కార్యకర్తలు గమనించి రూట్‌ మ్యాప్‌కు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ జిల్లాలో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే... 

విశాఖపట్నం: ఆర్కే బీచ్‌లో
గుంటూరు: పార్టీ కార్యాలయం నుంచి లాడ్జ్‌ సెంటర్‌ వరకు (అంబేడ్కర్‌ విగ్రహం) 
ప్రకాశం: చర్చి సెంటర్‌ నుంచి వైయస్‌ఆర్‌ విగ్రహం వరకు
శ్రీకాకుళం: సూర్యమహల్‌ జంక్షన్‌ నుంచి సెవన్‌ రోడ్‌ జంక్షన్‌ వరకు
అనంతపురం: సప్తగిరి సర్కిల్‌ నుంచి వైయస్‌ఆర్‌ విగ్రహం వరకు
విజయనగరం: కోట జంక్షన్‌ నుంచి మూడు లాంతర్లు.. గంట స్తంభం మీదుగా బాలాజీ జంక్షన్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు
వైయస్‌ఆర్‌ కడప: పార్టీ కార్యాలయం (ఎంపీ గెస్ట్‌హౌస్‌) నుంచి సెవెన్‌ రోడ్స్‌ వరకు
నెల్లూరు: గాంధీ బొమ్మ సెంటర్‌(ట్రంక్‌ రోడ్డు) నుంచి వీఆర్‌సీ సెంటర్‌ వరకు 
క్రిష్ణా: పార్టీ కార్యాలయం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు 
కర్నూలు: జిల్లా పరిషత్‌ ఆఫీస్‌ నుంచి రాజ్‌విహార్‌ సర్కిల్‌ వరకు
తూర్పు గోదావరి: కాకినాడలోని వినాయక కేఫ్‌ వైయస్‌ఆర్‌ విగ్రహం నుంచి భానుగుడి జంక్షన్‌ వరకు 
పశ్చిమ గోదావరి: ఏలూరు ఫైర్‌ ఆఫీస్‌ సెంటర్‌లో..
చిత్తూరు: చిత్తూరులోని గాంధీసెంటర్‌లో ..
Back to Top