కానుమాతకు కొవ్వొత్తుల సమర్పణ

రెంటచింతల: రాష్ట్రంలోని ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా  కానుమాత తల్లి ఆశీస్సులు నిండుగా,దండుగా,మెండుగా  కురిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, ఎమ్మెల్యే, పార్టీ విఫ్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేడుకున్నారు. కానుకమాత చర్చి 167వ పండుగ మహోత్సవాల్లో భాగంగా గురువారం వారు కానుమాతకు కొవ్వొత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా యూత్‌ అ«ధ్యక్షులు వనమాల వజ్రబాబు,రాష్ట్ర యూత్‌ కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి,జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి,రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోర్తల ఉమామహేశ్వరరెడ్డి ,జడ్‌పిటిసి నవులూరి భాస్కరరెడ్డి,మండల వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్ష,ఉపాద్యక్షులు పూజల రామయ్య,ఏరువ శౌరెడ్డి,సర్పంచ్‌ గు్రరాల రాజు,ఉపసర్పంచ్‌ ఏలూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. 

Back to Top