జీవో రద్దుకు డిమాండ్..!

విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ మంట
రగులుతూనే ఉంది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ప్రభుత్వం
జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రయూనివర్శిటీలో
గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈసందర్భంగా   పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే కిడారి
సర్వేశ్వర్ రావు విద్యార్థులను పరామర్శించారు.


చంద్రబాబు
ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ నేతలు, మన్యం వాసులు మండిపడ్డారు.
ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆదివాసీల జీవితాలతో
ఆడుకుంటే  తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.  వెంటనే జీవోను
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
Back to Top