బాబు వంచనపై ఫిర్యాదులకు పిలుపు

కాకినాడ : ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ నెల 8వ తేదీన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్ళలో పార్టీ శ్రేణులంతా సమావేశమై ...ప్రజలను వంచించిన టీడీపీ దగాకోరు తనాన్ని ఎండగట్టాలన్నారు.  ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమీపంలోని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు ముఖ్యనేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు.
Back to Top