రైతు దీక్షకు తరలిరండి

దాచేపల్లి: వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్ మోహన్‌రెడ్డి రైతుల కోసం మే 1, 2 తేదీల్లో గుంటూరులో చేపట్టిన రైతు దీక్షకు పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరావాలని ఆ పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మునగా పున్నారావులు కోరారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ..  టీడీపీ ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయిలో విస్మరించిందని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటం వలనే వైయ‌స్‌ జగన్ ఈ దీక్షను చేపట్టారని వారు చెప్పారు. దీక్షకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. 

Back to Top