కాల్ కీచకుల్ని శిక్షించాలని మహిళల ఆందోళన

విజయవాడః
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ
రోజురోజుకు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని
కోరుతూ.. విజయవాడ బందర్ రోడ్డులోకాల్‌మనీ పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత
మహిళలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలను తప్పించేందుకు చంద్రబాబు కుట్ర చేయడంపై
మండిపడుతున్నారు. మహిళల్ని చెరబట్టిన సెక్స్ రాకెట్  కీచకుల్ని
కటకటాల్లోకి పంపాలని.. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని
డిమాండ్ చేస్తూ మహిళలు రాస్తారోకో నిర్వహించారు. 
Back to Top