కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు

పోల్‌ట్యాక్స్‌ పేరుతో చంద్రబాబు సర్కార్‌ వేధిస్తోంది
వైయస్‌ జగన్‌ను కలిసి సమస్య చెప్పుకున్న ఆపరేటర్స్‌
పోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తానని జననేత స్పష్టమైన హామీ

తూర్పుగోదావరి: చంద్రబాబు విధానాలను కేబుల్‌ ఆపరేటర్స్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని సీమాంధ్ర కేబుల్‌ ఆపరేటర్స్‌ సంఘం ప్రతినిధులు వాపోయారు. పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. చంద్రబాబు సర్కార్‌ పోల్‌ ట్యాక్స్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఒక్కో పోలుకు రూ. 50 చెల్లించాలనే నిబంధన విధించడం దారుణమన్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు వచ్చాయి కానీ.. ఏ ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్‌ ద్వారా కేబుల్‌ ఆపరేటర్స్‌కు పన్ను విధించిన దాఖలాలు లేవన్నారు. విద్యుత్‌ శాఖకు రూ. 50 చెల్లించమనడం దురదృష్టకరమన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌తో అనుబంధంగా ఉన్నవారికే పన్ను మినహాయింపు ఉంటుందని, మిగిలినవారు డబ్బులు కట్టాల్సిందిగా వేధిస్తున్నారన్నారు. పెత్తందారి, పెట్టుబడి దారి వ్యవస్థను తీసుకొచ్చి ఆపరేటర్ల వ్యవస్థపై దాడి చేయడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాలు కేబుల్‌ ఆపరేటర్స్‌ను ఆదుకుంటే.. చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రియలన్స్‌ సంస్థకు రెడ్‌ కార్పొట్‌ పరుస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ పోల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తానని, రాబోయే మీటింగ్‌ ప్రకటిస్తానని చెప్పారన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ను కూడా చట్టబద్ధత చేసి పేదవారికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారన్నారు. 
Back to Top