రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

రాజ్యాంగనిర్మాతను రాష్ట్రసర్కార్ అవమానిస్తోంది
దళితులపై దాడులు దుర్మార్గం
తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగు నాగార్జున
అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అధినేత సహా పార్టీ నేతల ఘన నివాళి

హైదరాబాద్ః సమాజంలోని అస్పృశ్యతను పోగొట్టి అందరూ బతకడానికి అవకాశం ఉండేలా రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేద్కర్ ను రాష్ట్ర సర్కార్ అవమానిస్తోందని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగు నాగార్జున మండిపడ్డారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ...ఏపీలో పరిపాలన రాజ్యాంగ విలువలకు తాకట్టు పెట్టే విధంగా, చట్టాలు నీరుగార్చేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సాగుతోందని ధ్వజమెత్తారు. దళితులకు నిలువ నీడ లేకుండా చేసేలా భయబ్రాంతలు గొల్పుతున్నారని మండిపడ్డారు.స్వయంగా ముఖ్యమంత్రే ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు, మురికివాడల్లో పుట్టినవాళ్లకు మురికి ఆలోచనలే వస్తాయంటూ అవహేళన చేసేలా మాట్లాడడం దుర్మార్గమన్నారు.  

రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా దళితులకు రావాల్సిన వాటా రావడం లేదని, సబ్ ప్లాన్ నిధులను బాబు దారి మళ్లిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో చంద్రబాబు దళితులపై దాడులు కొనసాగిస్తున్నాడని ఆక్రోశించారు.  దళిత చట్టాలను చుట్టాలుగా మల్చుకొని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నాడని బాబుపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం అంబేద్కర్ నగర్ లో దళితులను బెల్టులతో ఇష్టారాజ్యంగా కొట్టిన సీఐ, ఎస్సైలతో పాటు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్, హ్యూమన్ రైట్ కమిషన్ లో కేసు వేస్తామన్నారు.  దళితులకు జరిగిన అన్యాయాన్ని మేరుగు నాగార్జున అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.  Back to Top