––ప్రభుత్వం ఏసీలో ఉంది..ప్రజలు మాడిపోతున్నారు––నిలదీసిన వైయస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి
బి.కొత్తకోట: గత సంవత్సరం కనిపించిన ఎండలు ప్రస్తుతం ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని తంబళ్లపల్లె నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మండలంలోని కోటావూరు గ్రామ పంచాయతీలోని పలు పల్లెల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గత సంవత్సరం ఎండలు మండిపోతున్నాయని ప్రభుత్వం మజ్జిగ పంపీణీ చేసింది. ఇప్పుడు ఎండలను తట్టుకోలేక జనం మాడిపోతుంటే మజ్జిగ అందించాలని ఎందుకు గుర్తుకు రావడంలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎండల్లో మాడిపోతున్నా..ప్రభుత్వం ఏసీల్లో ఉన్న కారణంగా ఎండల కష్టం తెలియడంలేదని ఎద్దేవా చేసారు. గ్రామాల్లో ప్రజలకేకాక మూగజీవాలకు నీటి కష్టం వచ్చిపడిందన్నారు. దీనిపై ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భూగర్బజలాలు అడగంటిపోయి వ్యవసాయం ఆగిపోయిందన్నారు.
’నిధులు ఇవ్వకుండా పరిష్కారమానియోజకవర్గంలో తాగునీటీ సమస్య కోసం అధికారులు ప్రతిపాదించిన ప్రణాళిక ఏమైందని అదికారులను ప్రశ్నించారు. వేసవిలో నిధులు మంజూరు చేయకుండా నీటి సమస్య ఏలా తీరుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదని విమర్శించారు. సమ్మర్‌యాక్షన్‌ప్లాన్‌కేవలం యాక్షన్‌గా మారిపోయిందన్నారు. వేసవి వెళ్లిపోయాక నిధులిచ్చి ఖర్చు చేయమంటారా అని నిలదీశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించి చేతులు దులుపుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఖలీల్, తంబళ్లపల్లె ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరమ్మ, ఎంపీటీసీలు ఈశ్వర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, కోఆప్షన్‌సభ్యులు టీ.బావాజాన్, నరసింహులునాయడు తదితరులు పాల్గొన్నారు.