నో క్యాష్ కష్టాల నుంచి గట్టెక్కించండి

న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో ఎక్కడ చూసినా నగదు నిల్వలు లేవంటూ ఏటీఎంల ముందు బోర్డులు పెడుతున్నారని వైయస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. పెద్ద నోట్లరద్దు ప్రక్రియను తాము స్వాగతి స్తున్నామని, అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.  లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. బ్యాంకులకు వెళ్లినా నగదు ఉపసంహరణ సేవలు అందడం లేదన్నారు. ప్రజల కష్టాలను ఇకనైనా తొలగించాలన్నారు.

Back to Top