కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: బుట్టా రేణుక


న్యూఢిల్లీ:  కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె వినతిపత్రాన్ని అందజేశారు.  అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీలోని ఒకే జిల్లాలో కాకుండా అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరానన్నారు. కర్నూలులో తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ త్వరలోనే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రాలు అంద జేయనున్నట్లు చెప్పారు.
Back to Top