ఇఫ్తార్‌ విందు పేరుతో నంద్యాల ప్రజలను మభ్యపెడుతున్న బాబు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు కోరారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించాడని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని వారు మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా వ్యాప్త ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బుట్టా రేణుక, గౌరు చరితారెడ్డిలు కోరారు.

Back to Top