వైయస్ఆర్ ఆశయాలకు జీవం పోయండి

  • బాబు మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్నాడు
  • రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు
  • బాబు అబివృద్ధి అంతా శిలాఫలకాలకే పరిమితం
  • వైయస్ఆర్ ఏపీని దేశంలోనే గొప్పరాష్ట్రంగా తీర్చిదిద్దారు
  • జగనన్న మనకు మంచి పాలన అందిస్తాడు
  • నంద్యాల ప్రజలకు మంచి అవకాశం వచ్చింది
  • శిల్పాకు ఓటేసి వైయస్ఆర్ ఆశయాలకు జీవం పోయండి
  • వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక
కర్నూలుః నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గత మూడేళ్లుగా మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతూ ఏ హామీని నెరవేర్చని ప్రభుత్వానికి నంద్యాల ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బుట్టా రేణుక పిలుపునిచ్చారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మల్యే రోజా కలిసి పెద్దకొట్టాలలో బుట్టా రేణుక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఏమన్నారంటే...

బాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. వడ్డీతో సహా మాఫీ చేస్తామని చెప్పి రైతులు, మహిళల్ని దేనికి కాకుండా చేశారు. ఏ బ్యాంకులకు వెళ్లినా రుణాలు దొరకని పరిస్థితని తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనమంతా ఆలోచించాలి. రాయలసీమకు బాబు అన్యాయం చేస్తున్నారు. మూడేళ్లుగా సీమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బాబు అధికారంలోకి వచ్చాక కర్నూలుకు తొలిసారిగా ఆగష్టు 15న వచ్చి చాలా హామీలిచ్చారు. కర్నూలుకు స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ, ఉర్ధూ యూనివర్సిటీ అంటూ ఎన్నో హామీలు గుప్పించారు. కానీ, అవన్నీ శిలాఫలకాలకే పరిమితం చేశారు. మూడేళ్లుగా కేంద్రం నిధులిస్తున్నా ఆ పనులేవి జరగడం లేదు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టే తిరుగుతోంది. అక్కడ ఏపాటి అభివృద్ధి జరుగుతుందో అక్కడి ప్రజలే చెప్పాలి. సీమలో మాత్రం అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. హామీలతో మభ్యపెడుతున్నారు.

వైయస్ఆర్ తన ఐదేళ్ల పరిపాలనలో ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని వాళ్లకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు రూపొందించారు. కార్పొరేట్ సంస్థల్లో వైద్యం ఎంత ఖరీదైందో అందరికి తెలుసు.  ఎవరూ ఊహించని విధంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలిప్పిచ్చారు. రైతులకు రుణమాఫీ చేశారు.  ఇప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. వైయస్ఆర్ పరిపాలన విధానాలు తెలుసుకున్న వైయస్ జగన్ ప్రజాపరిపాలన ఎలా చేయాలి. ప్రజల సమస్యలు ఏవిధంగా తీర్చాలన్నదానిపై పూర్తిగా అవగాహనతో ఉన్నాడు.  ప్రజల సమస్యలు తెలుసుకున్న వాడే రాజవుతారు. ఆ లక్షణాలన్నీ వైయస్ జగన్ కు ఉన్నాయి. మనకు మంచి పాలన అందిస్తాడు.

బాబు పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోని పరిస్థితి. యువత నిరుద్యోగంతో బాధపడుతున్నా ఉద్యోగాలు కల్పించని పరిస్థితి. వర్షాపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను పట్టించుకోని పరిస్థితి. వైయస్ఆర్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ లన్నీ ఆగిపోయాయి. వాటిని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిచాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తే ఎవరు మనల్ని కాపాడుతారు. ఎవరు ప్రజాపరిపాలన చేస్తారన్న నిర్ణయానికి ప్రజలు వచ్చి ఉంటారు . విలువలు, విశ్వసనీయతతో ముందుకెళ్లే పార్టీ వైయస్సార్సీపీ అని గర్వంగా చెబుతాం. ఆ పార్టీలో ఉన్నందుకు ప్రజాప్రతినిధులుగా మేం గర్విస్తున్నాం. ప్రజలను మోసం చేసి తాత్కాలికంగా అధికారంలోకి రాకూడదన్న నిర్ణయంతోనే 2014లో జగనన్న అబద్ధపు హామీలివ్వలేదు. ఏ హామీలిస్తే నెరవేరుస్తామో అవే ఇవ్వడం జరిగింది. నిజాయితీ, నమ్మకంపైన ప్రజల హృదయాల్లో ఉండాలనుకున్న పార్టీ కాబట్టి నిజం చెబుతూ ప్రజల్లో ధైర్యంగా దూసుకుపోతంది. నంద్యాల ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. వైయస్ఆర్ ఆశయాలకు జీవం పోసే అవకాశం వచ్చింది. మహానేత ఆశయాలకు జీవం పోస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పాను గెలిపిస్తారని
ఆశిస్తున్నాం. శిల్పా నంద్యాల ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ లాంటి  ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. సున్నిత మనస్కుడు. మాకంటే మీకే ఎక్కువగా శిల్పా గురించి తెలుసు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్ననకు మద్దతిస్తూ శిల్పాను ఆశీర్వదించి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాం. 

Back to Top