వ్యాపారస్తులను మంత్రులు చేశారు

ఏపీ అసెంబ్లీ: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నారాయణ, గంటా శ్రీనివాసరావు పెట్టుబడి పెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. గంటా, నారాయణ ఇద్దరు కూడా ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు కాదని, వ్యాపారస్తులని విమర్శించారు. వ్యాపారులను మంత్రులను చేసిన టీడీపీ..వారి వ్యాపార లావాదేవీల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. నారాయణ విద్యా సంస్థల్లో పేపర్లు లీక్‌ చేసుకొని అన్ని ర్యాంకులు వారే పొందుతున్నారని ఆరోపించారు. నాలుగు జిల్లాల్లో పేపర్‌ లీక్‌ అయితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తన పెట్టుబడి దారులను రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Back to Top