ప్రభుత్వ తీరుతో వాణిజ్య రంగం కుదేలు



– విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ వాణిజ్య విభాగం ప్రథమ సమావేశం
 
విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల తీరుతో వాణిజ్య రంగం కుదేలైందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం వాణిజ్య విభాగం ప్రథమ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాణిజ్య సంక్షోభం నెలకొందని   విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్‌టీ, నోట్ల రద్దు కారణంగా వ్యాపార రంగం కుదేలైందన్నారు. జీఎస్టీ కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు తెలపకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నోట్ల రద్దు కారణంగా వ్యాపార రంగం కుదైలైనా కూడా చంద్రబాబు నోరు మెదపడడం లేదన్నారు. వ్యాపార ప్రోత్సాహకాలు ఎక్కడా లేవని విమర్శించారు. వ్యాపార సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొత్తగా చంద్రన్న మాల్స్‌ తీసుకొచ్చి వ్యవస్థను పూర్తిగా దెబ్బతిశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య విభాగం సమావేశంలో అనేక విషయాలపై కులంకుషంగా చర్చించి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని మల్లాది విష్ణు తెలిపారు. సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పుత్తా చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top