రేపటి బంద్ ను విజయవంతం చేద్దాం

వైయస్సార్ జిల్లాః

విభజన రూపంలో ఏపీని నాశనం చేసిన టీడీపీ, బీజేపీలు...ప్రత్యేకహోదా విషయంలో మరోసారి మోసం చేసి నాశనం చేశాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడేందుకు, వైయస్ జగన్ నాయకత్వలో హోదాను సాధించడం కోసం ప్రజాభిష్టాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు బంద్ కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. దానిలో భాగంగానే ఇవాళ పార్టీ ఆదేశాల మేరకు బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇదే మాదిరి రేపటి బంద్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Back to Top